తిప్పతీగలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని, ఇది సర్వరోగ నివారిణి అని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్న తిప్పతీగ జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మధుమేహ రోగులకు, పేగుల ఆరోగ్యానికి, కీళ్ల నొప్పులకు, దీర్ఘకాలిక జ్వరాలకు, చర్మ సమస్యలకు, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రక్త శుద్ధికి, కాలేయ ఆరోగ్యానికి, ఒత్తిడి తగ్గించడానికి ఇది మేలు చేస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో కొద్ది పరిమాణంలో నీటితో కలిపి తాగడం వల్ల ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.