రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు ఇది : CM చంద్రబాబు

6చూసినవారు
రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు ఇది : CM చంద్రబాబు
AP: 2024 జూన్ 4వ తేదీ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసానికి స్వస్తి పలికి వికాసం వైపు నడిపించాలని ప్రజలు ఇచ్చిన తీర్పు వెలువడిందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమకు అధికారాన్ని కాదని, రాష్ట్ర పునర్నిర్మాణానికి బాధ్యత అప్పగించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే లక్ష్యంగా పనిచేస్తోందని, అసమానతలు లేని సమాజం, అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ లక్ష్యమని, రాష్ట్రాన్ని ఆరోగ్యంగా, ఆర్థికంగా సంతోషంగా ఉంచడమే సంకల్పమని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్