ఇది ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ క్షణం: పవన్ కల్యాణ్

91చూసినవారు
ఇది ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ క్షణం: పవన్ కల్యాణ్
AP: రాజధాని అమరావతికి లోక్‌సభలో చట్టబద్ధత లభించడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ గర్వించదగ్గ క్షణమని, అమరావతి ఇక ఆంధ్రుల శాశ్వత రాజధానిగా సుస్థిర స్థానాన్ని పొందిందని ఆయన పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు అనుభవంతో అమరావతి భావితరాల అభివృద్ధికి కేంద్రంగా విరాజిల్లుతుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాజధాని నిర్మాణం వేగవంతం అవుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్