ఇది ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అమ‌రావ‌తి విజ‌యం: లోకేష్

10602చూసినవారు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన అమరావతి బిల్లుకు పార్లమెంటు ఆమోదంపై మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. 'ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని' నినాదంతో అభివృద్ధి వికేంద్రీకరణ విధానంలో అమరావతిని రాజధానిగా నిర్ణయించిన ఈ తీర్మానానికి చట్టబద్ధత కల్పించడం కోట్లాది మంది ప్రజలు గర్వించదగిన సందర్భంగా అభివర్ణించారు. 'ఇది రైతుల త్యాగాలకు, శాంతియుత పోరాటానికి దక్కిన ఫలితమని, ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధానిగా అమరావతిని నిలిపిన కేంద్ర ప్రభుత్వానికి, మద్దతు తెలిపిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం అని' ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్