ప్రభుత్వానికి విద్యుత్తు అమ్ముతున్న గ్రామం ఇదే!

7473చూసినవారు
ప్రభుత్వానికి విద్యుత్తు అమ్ముతున్న గ్రామం ఇదే!
గుజరాత్‌లోని బనాస్‌కాంఠా జిల్లా రూపపుర గ్రామం పూర్తిగా సౌరశక్తిని వినియోగించుకుంటూ దేశానికే ఆదర్శంగా నిలిచింది. గ్రామంలోని 90 శాతం ఇళ్లు, పొలాల్లో సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేయడంతో అవసరమైన విద్యుత్తును తామే ఉత్పత్తి చేస్తున్నారు. మిగిలిన విద్యుత్తును ప్రభుత్వానికి విక్రయిస్తూ ఒక్కో కుటుంబం ఏటా రూ.5,000 నుంచి రూ.7,000 వరకు ఆదాయం పొందుతోంది. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, బనాస్‌ డెయిరీ సహకారంతో ఈ మార్పు సాధ్యమైందని గ్రామస్థులు చెప్తున్నారు.

సంబంధిత పోస్ట్