AP: ఈ ఏడాది రిరైట్ అవుతున్న రాజ్యసభ సభ్యుల జాబితాను శుక్రవారం రాజ్యసభ సచివాలయం విడుదల చేసింది. ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. వైసీపీ ఎంపీలు అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, పిల్లి సుభాశ్ చంద్రబోస్, టీడీపీ ఎంపీ సానా సతీశ్‌ల పదవీకాలం ఈ ఏడాది జూన్‌తో ముగుస్తుందని తెలిపారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల నామినేటెడ్ సభ్యుల పదవీకాలం వివరాలను వెల్లడించారు.