AP: ఫిబ్రవరి 5న విజయవాడలో జరగనున్న ఏపీజేఏసీ రాష్ట్ర మహాసభకు హాజరయ్యే ఉద్యోగులకు ప్రభుత్వం రెండు రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసింది. ఈ నెల 4, 5 తేదీల్లో ఉద్యోగులకు సెలవులు వర్తిస్తాయి. రాష్ట్రంలోని 90 విభాగాల ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని ఏపీజేఏసీ ఛైర్మన్ బొప్పరాజు విజ్ఞప్తి చేయగా.. ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది.