AP: గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి, అనాధీన, ఆక్రమిత భూముల్లో ఉంటున్న వారికి ప్రభుత్వం చట్టబద్ధంగా హక్కులు కల్పించనుంది. ప్రతి ఆస్తిని గుర్తించి, విలువను లెక్కించి, యజమానులకు హక్కులు కల్పించనున్నారు. ఈ ప్రాపర్టీ కార్డుల ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు పొందడంతో పాటు, ఆస్తుల క్రయ విక్రయాలు సులభతరం అవుతాయి. భూములు, ఇళ్లపై చట్టబద్ధమైన హక్కులు లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు, రుణ సదుపాయం పొందలేకపోతున్న వారికి, ఆస్తుల అమ్మకం, కొనుగోలులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ చర్యలు ఉపశమనం కలిగిస్తాయి.