పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే పదవులు కోల్పోతారు: మంత్రి లోకేశ్

34చూసినవారు
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే పదవులు కోల్పోతారు: మంత్రి లోకేశ్
AP: టీడీపీ క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌ల సమావేశంలో మంత్రి లోకేశ్ పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. వ్యక్తుల కంటే పార్టీయే శాశ్వతమని, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే పదవులు కోల్పోతారని హెచ్చరించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రభుత్వ కొనసాగింపు అత్యంత అవసరమని, ప్రతి ఓటును కీలకంగా పరిగణించాలన్నారు. ఓటర్లను గౌరవించాలని, ప్రజల్లోకి వెళ్లాలని ఆయన సూచించారు. 2027లోపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తానన్నారు.

ట్యాగ్స్ :