ఒకే ఫ్యామిలీలో ముగ్గురు పిల్లలకు ఒకటే బర్త్‌డే.. డాక్టర్‌దీ అదే తేదీ!

10769చూసినవారు
ఒకే ఫ్యామిలీలో ముగ్గురు పిల్లలకు ఒకటే బర్త్‌డే.. డాక్టర్‌దీ అదే తేదీ!
తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. జెఫర్‌సన్-షీబా దంపతుల ముగ్గురు పిల్లలు వేర్వేరు సంవత్సరాల్లో జన్మించినప్పటికీ అందరి పుట్టినరోజు జూన్ 10నే కావడం విశేషం. 2015లో కుమారుడు, 2017లో మొదటి కుమార్తె, 2025లో రెండో కుమార్తె జూన్ 10న జన్మించారు. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ముగ్గురి ప్రసవాలను నిర్వహించిన డాక్టర్ రామోలాజనత్ కూడా జూన్ 10నే జన్మించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు పిల్లలకు, వారికి జన్మనిచ్చిన వైద్యురాలికీ ఒకే పుట్టినరోజు రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్