ప్రతి రేషన్ కార్డుకు మూడు కిలోల రాగులు ఉచితం

121చూసినవారు
ప్రతి రేషన్ కార్డుకు మూడు కిలోల రాగులు ఉచితం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా చౌక ధరల దుకాణాల్లో డిసెంబర్ నెల కోటాలో భాగంగా బియ్యానికి బదులుగా రాగులను పంపిణీ చేయనుంది. పోషకాహారం అందించాలనే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం, ప్రతి రేషన్ కార్డుదారునికి మూడు కిలోల రాగులు ఉచితంగా అందజేస్తారు. దీనితో పాటు మూడు కిలోల బియ్యం తగ్గిస్తారు. అన్ని రేషన్ డిపోలకు రాగుల సరఫరా పూర్తయింది.

సంబంధిత పోస్ట్