రేషన్ కార్డుదారులకు మూడు నెలల కోటా విడుదల

5353చూసినవారు
రేషన్ కార్డుదారులకు మూడు నెలల కోటా విడుదల
వాతావరణ శాఖ హెచ్చరికలు, పెరుగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార భద్రత (రేషన్) కార్డు లబ్ధిదారులకు భారీ వెసులుబాటు కల్పించాయి. ఏప్రిల్ మాసంలోనే మూడు నెలల (ఏప్రిల్, మే, జూన్) కోటాను పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలకు రేషన్ కోటాను విడుదల చేసి, పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం నుంచి ప్రభుత్వ చౌక ధరల దుకాణాలకు పీడీఎస్ బియ్యం సరఫరా ప్రారంభమైంది.

సంబంధిత పోస్ట్