కొరియన్ గేమ్స్, డ్రామాలకు బానిసై ముగ్గురు బాలికలు సూసైడ్

4573చూసినవారు
కొరియన్ గేమ్స్, డ్రామాలకు బానిసై ముగ్గురు బాలికలు సూసైడ్
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మంగళవారం అర్ధరాత్రి రెండు గంటలకు ముగ్గురు బాలికలు (12, 14, 16 ఏళ్లు) తాము  అపార్ట్‌మెంట్ లో తొమ్మిదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కొరియన్ కల్చర్ వీడియోలు, మొబైల్ గేమ్‌లకు బానిసలైన వీరు, రెండేళ్లుగా స్కూల్‌కు వెళ్లడం లేదని, ఆర్థిక ఇబ్బందులు కూడా కారణమని స్థానికులు చెబుతున్నారు. ఆన్‌లైన్ గేమింగ్, కొరియన్ డ్రామాల ప్రభావంతో ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. సూసైడ్ లేఖలో తాము ఒంటరివాళ్లమని, తండ్రిని క్షమించమని కోరినట్లు సమాచారం. సైబర్ క్రైమ్ పోలీసులు మొబైల్ ఫోన్లను పరిశీలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్