AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై మంత్రి సవిత తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో పాఠశాలల అభివృద్ధి చేసి ఉంటే జగన్ మాట్లాడొచ్చని, కానీ ఆయనకు ఆ అర్హత లేదని పేర్కొన్నారు. రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడారని ఫైరయ్యారు. పరకామణి చోరీ జగన్‌కు చిన్న తప్పుగా కనిపించవచ్చని, కానీ కోర్టులకు ఇది పెద్ద నేరమే అవుతుందన్నారు.