ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, TP నగర్‌లో ఒక బ్యూటీ పార్లర్‌లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో ముగ్గురు యువతులు, ముగ్గురు యువకులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అమృత్ త్యాగి, ఇర్షాద్ సోను అనే వ్యక్తులు ఈ పార్లర్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం యజమానులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వారి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.