బంగారం లాక్కుని మహిళను బావిలో తోసేసిన దుండగుడు (వీడియో)

30429చూసినవారు
TG: కరీంనగర్(D) తిమ్మాపూర్(M) కిసాన్ నగర్ కు చెందిన గంగాధర లక్ష్మీ (55) అనే మహిళను కూలి పని ఇప్పిస్తానని చెప్పి, నుస్తులాపూర్ గ్రామ శివారులోని బావిలో తోసేశాడు ఓ దుండగుడు. మహిళ వద్ద ఉన్న అర తులం బంగారం, 4వేల నగదును లాక్కుని, బావిలో తోసి పైకి రాకుండా తాడును కోసేసి పారిపోయాడు. ఆమె 21 గంటల పాటు బావిలో మోటారు పైపును పట్టుకుని ప్రాణాలను కాపాడుకుంది. మరుసటి రోజు భూ యజమాని బావిలో కేకలు విని గ్రామస్తుల సహాయంతో ఆమెను బయటకు తీశారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్