AP: అనంతపురం జిల్లా, కల్యాణదుర్గంలోని వడ్డేకాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒక వృద్ధురాలిని హత్య చేసి, ఆమె ఇంట్లో ఉన్న బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. దుండగులు వృద్ధురాలిని ఎలా హత్య చేశారు, ఎంత బంగారం దోచుకెళ్లారు అనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.