ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి
వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని
వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత జగన్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. పార్టీ ఎమ్మెల్సీలంతా సమన్వయంతో పని చేసి తూమాటి మాధవరావు ఎన్నిక సాఫీగా జరిగేలా పూర్తి మద్దతు ఇవ్వాలని జగన్ సూచించారు.