AP: రాష్ట్ర ప్రజలకు APSDMA మరోసారి హెచ్చరిక జారీ చేసింది. మరో 3 గంటలు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.