ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతుండటంతో పాటు ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలతో పాటు 19 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 21 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.