రేపు పిడుగులతో వర్షాలు: APSDMA

51చూసినవారు
రేపు పిడుగులతో వర్షాలు: APSDMA
AP: రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) వెల్లడించింది. ఈ నేపథ్యంలో కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. అలాగే ప్రజలు చెట్ల కింద నిలబడరాదని సూచించింది.

ట్యాగ్స్ :