రేపు పిడుగులతో కూడిన వర్షాలు: APSDMA

53చూసినవారు
రేపు పిడుగులతో కూడిన వర్షాలు: APSDMA
AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. ఆ సమయంలో చెట్ల కింద ఉండరాదని సూచించింది. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది ప్రవాహం కొన్ని రోజులు హెచ్చుతగ్గులుగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం సాయంత్రం నాటికి ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4,56,400 క్యూసెక్కులు ఉందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్