ఏపీలోని పలు జిల్లాల్లో శుక్రవారం పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడుతాయని వెల్లడించింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA హెచ్చరించింది.