ఏపీలోని ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

25చూసినవారు
ఏపీలోని ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
ఏపీలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఆదివారం శ్రీకాకుళం, అల్లూరి, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నదికి స్వల్పంగా వరద పెరుగుతోందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో/ఔట్ ఫ్లో 5.19 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఆదివారం నాడు వరద ప్రవాహం 8-9 లక్షల క్యూసెక్కులకు చేరి, అనంతరం క్రమంగా తగ్గే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్