AP: రేపు(ఆదివారం) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది. మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల సమయంలో చెట్ల కింద లేదా ఓపెన్ ప్రదేశాల్లో నిలబడరాదని హెచ్చరించింది. కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతున్నందున పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.