ఏపీలోని ఈ జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు

66చూసినవారు
ఏపీలోని ఈ జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ప్రకాశం, శ్రీసత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇవాళ సాయంత్రం 5 గంటల నాటికి తిరుపతి (D) చిట్టమూరులో 88.5mm, చింతవరంలో 81mm, నెల్లూరులో 61mm, పాలూరులో 60mm వర్షపాతం నమోదైనట్లు తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్