
చంద్రగిరి : కర్ణాటక ఆర్టీసీ బస్సు, కారు ఢీ
చంద్రగిరి మండలం, రమణప్పగారిపల్లె సమీపంలో రాత్రి కర్ణాటక ఆర్టీసీ బస్సును కారు ఢీకొన్న ఘటనలో కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మద్యం మత్తులో డ్రైవర్ వాహనం నడిపినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



































