కొడియంబేడు వద్ద కారు - లారీ ఢీ

633చూసినవారు
కొడియంబేడు వద్ద కారు - లారీ ఢీ
నాగలాపురం మండలం బయట కొడియంబేడు వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై వైపు వెళ్తున్న కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు, స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

సంబంధిత పోస్ట్