చంద్రగిరి మండలం చవటకాల్వకు చెందిన గిరిజనులు పోలీసుల వేధింపులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దొంగతనం కేసులో నలుగురిని అదుపులోకి తీసుకుని, ఐదు రోజులుగా చంద్రగిరి, తిరుచానూరు పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. చేయని నేరాన్ని ఒప్పుకునేలా చిత్రహింసలు పెడుతున్నారని, మఫ్టీలో వచ్చి ఇళ్లపై దాడి చేశారని బాధితులు తెలిపారు. పోలీసుల వేధింపుల వల్ల తమ ప్రాణాలకు ముప్పు ఉందని వారు వాపోయారు.