చంద్రగిరి: హాస్టల్ భవనం పైనుంచి పడి బీటెక్ విద్యార్థి మృతి

1622చూసినవారు
చంద్రగిరి: హాస్టల్ భవనం పైనుంచి పడి బీటెక్ విద్యార్థి మృతి
చంద్రగిరి మండలం రంగంపేటలోని ఒక ప్రముఖ యూనివర్సిటీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఒంగోలు జిల్లా వాసి బాలాజీ (22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కళాశాల సమీపంలోని ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్న బాలాజీ బుధవారం అర్ధరాత్రి సమయంలో హాస్టల్ భవనం పైనుంచి కిందపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్