భాకరాపేటలో నకిలీ సీఐ అరెస్ట్

2841చూసినవారు
భాకరాపేటలో నకిలీ సీఐ అరెస్ట్
తిరుపతి జిల్లా భాకరాపేటలో కడప స్పెషల్ బ్రాంచ్ సీఐనని చెప్పుకుంటూ ప్రజలను బెదిరించి, ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసిన కురబోతుల శివయ్య అలియాస్ శివకుమార్‌(33)ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఒకరి బంగారు ఉంగరాన్ని కొట్టేసినట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది. భాకరాపేట సీఐ ఇమ్రాన్ బాషా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.