రామచంద్రాపురం మండలం నెన్నూరు గ్రామంలో నక్కలేరు వాగులో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగు పక్కనే ఉన్న సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాల భవనాలు ప్రమాదంలో పడ్డాయి. నీరు గట్టుకు దగ్గరగా రావడంతో భవనాలు దెబ్బతినే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే గట్టును బలపరిచి, అధికారులు పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.