యోగా, ధ్యానంతో ఒత్తిడికి చెక్‌.. ఎంఈఓ బాబ్జి

4చూసినవారు
యోగా, ధ్యానంతో ఒత్తిడికి చెక్‌.. ఎంఈఓ బాబ్జి
తిరుపతి జిల్లా పాకాల మండల విద్యా శాఖాధికారి బాబ్జి మంగళవారం స్థానిక యన్. వి. యన్. పాఠశాలలో యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా, ధ్యానం వల్ల శారీరకంగా, మానసికంగా ఉల్లాసం, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఆయన అన్నారు. పని ఒత్తిడి వల్ల వచ్చే బీపీ, షుగర్ వంటి వ్యాధులను జయించడానికి యోగా దోహదపడుతుందని, ఇది మనిషి ఆయుష్షును కూడా పెంచుతుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్