మాజీ MLA చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి చేరుకున్నారు. అక్రమ మద్యం కేసులో ఆయనకు 226 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత బెయిల్ వచ్చింది. దీంతో విజయవాడ నుంచి ఫ్లైట్‌లో తిరుపతికి వచ్చిన ఆయన కారులో స్వగ్రామం చంద్రగిరి(M) తుమ్మలగుంటకు బయలుదేరారు. ఈ క్రమంలో ఏర్పేడు టోల్ ప్లాజా వద్ద శ్రేణులు, అభిమానులు బాణసంచా పేల్చి స్వాగతం పలికారు. అభిమాన నాయకుడిని చూసి కార్యకర్తలు భావోద్వేగానికి లోనయ్యారు.