ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

16చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి–రేణిగుంట ప్రధాన రహదారిలో ఉగాది హోటల్ సమీపంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముషిని శ్రీనివాసులు (19) అనే యువకుడు మృతి చెందాడు. నెల్లూరు నుండి తిరుపతికి స్నేహితులతో కలిసి స్కూటీపై వస్తుండగా, అతివేగంగా, నిర్లక్ష్యంగా వచ్చిన కారు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసులు తలకు తీవ్ర గాయాలై ఆసుపత్రికి తరలించేలోపే మరణించగా, అతని స్నేహితులు చికిత్స పొందుతున్నారు. రేణిగుంట అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్