చంద్రగిరి పట్టణంతో పాటు శివారు పంచాయతీలలో పెట్రోల్ దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్ల ముందు నిలిపిన వాహనాల నుండి గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ దొంగిలిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున మూడు ఇళ్ల వద్ద వాహనాల నుండి పెట్రోల్ దొంగిలించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో ఆలస్యంగా వైరల్ కావడంతో, పరిస్థితి మరింత తీవ్రతరం కాకముందే దొంగలను పట్టుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.