తిరుపతిలో ఎస్టీవీ నగర్‌కు చెందిన దివాకర్ అనే యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. సోమవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిన అతడి మృతదేహం మంగళవారం డ్రైనేజీ కాలువలో లభ్యమైంది. పారిశుద్ధ్య కార్మికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.