రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జిల్లా వాసులు మృతి

11చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జిల్లా వాసులు మృతి
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు జాతీయ రహదారిపై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. తిరుపతి జిల్లా మంగళం గ్రామానికి చెందిన హరిప్రసాద్, విశాలాక్షి, లావణ్య కుమారి, కాన్సిత్, ప్రణశ్రీ తిరుమలలో ఒప్పంద ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరు శనివారం మంగళం నుంచి విజయవాడకు కారులో వెళ్తుండగా మూలగుంటపాడు వద్ద అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హరిప్రసాద్, విశాలాక్షి ఘటనా స్థలంలోనే మరణించగా లావణ్య కుమారి, కాన్సిత్, ప్రణశ్రీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్