కారు ఢీకొని కార్మికులకు గాయలు

1108చూసినవారు
కారు ఢీకొని కార్మికులకు గాయలు
చంద్రగిరిలో పంచాయతీ ఈఓ విధుల పేరుతో తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారని కార్మికులు ఆరోపించారు. ఉదయం అత్యవసరంగా నూర్ జంక్షన్‌కు రావాలని ఆదేశించడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు కార్మికులు కారు ఢీకొని గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో 108 అంబులెన్స్‌లో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం తెలిసినా ఈఓ స్పందించకుండా బ్యానర్ల తొలగింపు పనుల్లోనే కొనసాగారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల ప్రాణాల కంటే బ్యానర్లకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తూ ఈఓ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్