
చంద్రగిరి హైవేపై కారు బోల్తా… ఇద్దరికి తీవ్ర గాయాలు
చంద్రగిరి హైవేపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని తప్పించబోయిన కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బంగారుపాళ్యం మండలం గుంతూరు గ్రామానికి చెందిన జేసీబీ నరేంద్ర, మడుపోలూరు సురేంద్ర తీవ్రంగా గాయపడ్డారు. 108 అంబులెన్స్ సిబ్బంది వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



































