32 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత.. ఐదుగురు అరెస్ట్

2671చూసినవారు
32 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత.. ఐదుగురు అరెస్ట్
చిత్తూరు జిల్లా రొంపిచెర్ల క్రాస్ వద్ద పోలీసులు శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 32 టన్నుల ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్ట్ చేసి, ఒక లారీ, ఒక ఈచర్ వాహనం, ఒక ఎర్టిగా కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి కర్ణాటకకు తరలించి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్