చిత్తూరు జిల్లా మురుకంబట్టు ప్రాంతంలో పోలీసులు 600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, వేలూరుకు చెందిన జై కుమార్, మహమ్మద్ అలీ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు నిర్వహించిన వాహన తనిఖీల్లో గంజాయి పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.