చిత్తూరు పట్టణంలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన యువకుడు

455చూసినవారు
చిత్తూరు కలెక్టర్ కార్యాలయ సమీపంలోని ఓ కాఫీ దుకాణం వద్ద గురువారం పులిచర్ల మండలానికి చెందిన మోహన్ (28) అనే యువకుడు కుటుంబ కలహాల కారణంగా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి అతన్ని 108 ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్