చిత్తూరులో రైతులకు ఆధునిక సాగుపై అవగాహన రథం ప్రారంభం

1చూసినవారు
చిత్తూరులో రైతులకు ఆధునిక సాగుపై అవగాహన రథం ప్రారంభం
చిత్తూరు జిల్లాలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌ ఏర్పాటులో భాగంగా శుక్రవారం 20 గ్రామాల్లో రైతులకు అధునాతన సాగు పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన కల్పించేందుకు ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ప్రచార రథాన్ని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సతీష్ ప్రారంభించారు. రోజుకు రెండు గ్రామాల్లో సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు కళాజాతాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు ప్రభుత్వ ప్రోత్సాహకాలు, రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్