జనవరి 30న, కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా చిత్తూరులో వైద్య ఆరోగ్య శాఖ ఉపవైద్యాధికారి డాక్టర్ వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రశాంత్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ నందు విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించి, ప్రతిజ్ఞ చేశారు. మహాత్మా గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఆయన కుష్టు వ్యాధిగ్రస్తుల పట్ల చేసిన సేవలకు గుర్తింపుగా, ఫిబ్రవరి 16 వరకు అన్ని గ్రామాలలో స్పర్శ కుష్టు నివారణ అవగాహన కార్యక్రమం నిర్వహించబడుతుంది. క్షేత్రస్థాయి సిబ్బంది ఇంటింటి సర్వే చేసి, అనుమానిత కేసులను నిర్ధారించి చికిత్స ప్రారంభిస్తారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.