నిండ్రలో సుబ్రహ్మణ్య స్వామికి భరణి కావడి పూజలు

11చూసినవారు
నిండ్రలో సుబ్రహ్మణ్య స్వామికి భరణి కావడి పూజలు
చిత్తూరు జిల్లా నగరి నిండ్ర మండల కేంద్రంలోని శ్రీ ప్రసన్న గణపతి దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ, సుబ్రహ్మణ్య స్వామికి ఆవుపాలు, పెరుగు, పంచామృతాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. అనంతరం స్కందషష్ఠి కవచాన్ని పారాయణ చేసి, మారేడు దళాలను స్వామివారికి సమర్పించారు. పలువురు భక్తులు కావడిలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

సంబంధిత పోస్ట్