గుడిపాల మండలంలోని బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిపై బొమ్మసముద్రం-రామపురం మధ్య ఉన్న రైల్వే గేట్‌ను బుధవారం నుంచి ఈనెల 9వ తేదీ వరకు తాత్కాలికంగా మూసివేయనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. నూతన పట్టాల ఏర్పాటు పనుల కారణంగా ఈ మూసివేత జరుగుతుంది. ఈ సమయంలో వాహనాల రాకపోకలు నిలిపివేయబడతాయి. కావున, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించారు.