కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ బాగుపడుతున్నాయని, చిత్తూరు టౌన్ బ్యాంక్ కూడా అభివృద్ధి చెందుతోందని, స్థానిక ప్రజల సహకారంతో మరింత పురోగమిస్తుందని ఎమ్మెల్యే గురజాల
జగన్ మోహన్ ఆదివారం జరిగిన చిత్తూరు టౌన్ బ్యాంకు మహాజన సమావేశంలో పిలుపునిచ్చారు. ఉద్యోగులు ఎదురుచూస్తున్న జీతాల పెంపుదల జరిగిందని, జీతాల బకాయిల మెగా చెక్కును అందించినట్లు ఆయన తెలిపారు.