సింధియా సంస్థ ఆధ్వర్యంలో చిత్తూరు కేంద్రంలో శనివారం దేశ నిర్మాణంలో యువతుల పాత్రపై అవగాహన కార్యక్రమం జరిగింది. సింధియా డైరెక్టర్ గ్లోరీ విజయ్ కుమార్, సెక్రటరీ షీలా బెంజిమెన్, డైరెక్టర్ అబ్రహం సంతానం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్ వి కే జిల్లా ఆఫీసర్ నిత్యానందం మునికృష్ణ మాట్లాడుతూ, యువతుల సమస్యలు, వారి హక్కులు, చట్టాలు, యుక్త వయసులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డ్రగ్స్, చేతి వృత్తులు, జీవన నైపుణ్యం, సమాజంలో యువకుల పాత్ర, ఎన్ వి కె ద్వారా శిక్షణ, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలపై వివరించారు.