చిత్తూరు: కలెక్టర్ ను కలిసిన ఏపీయుడబ్ల్యూజే నాయకులు

595చూసినవారు
చిత్తూరు: కలెక్టర్ ను కలిసిన ఏపీయుడబ్ల్యూజే నాయకులు
జర్నలిస్టులకు రెండవ విడత అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను గురువారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు లోకనాథన్ జర్నలిస్టుల సమస్యలపై కలెక్టర్ తో చర్చించారు. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అక్రిడేషన్ కమిటీ సభ్యులు, చిత్తూరు ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు పవన్, కార్యవర్గ సభ్యుడు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్